అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న తితిదే బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయ కేంద్రంలో భక్తులు భారీగా కొనుగోళ్లు జరిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అక్షయ తృతీయ గడియలు ఉండటంతో భక్తులు వరుసకట్టారు. ఆదివారం రూ.70 లక్షలు, సోమవారం రూ. 40 లక్షల విలువైన డాలర్లను కొనుగోలు చేశారు. గత సంవత్సరం దాదాపు రూ.90 లక్షల విలువైన డాలర్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగినా భక్తులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

