ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జస్టిస్ స్వరణ్ కాంత శర్మను విచారణను నుంచి తప్పించాలన్న కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్టు జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానాల ఆధారంగా న్యాయమూర్తి సమగ్రతను సవాలు చేయడం తగదని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, రాజకీయ నాయకులు బహిరంగంగా చేసే వ్యాఖ్యలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయలేవని, వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని జస్టిస్ స్వరణ్ కాంత్ శర్మ స్పష్టం చేశారు.

