ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా డీఎంకే ఏర్పాటు అయిందని ఇప్పుడు ఆ డీఎంకే.. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటోందని విమర్శలు గుప్పించారు. గతంలో జయలలిత పోటీ చేసిన సమయంలో ఎన్డీఏ తరపున ప్రచారానికి వచ్చారని… ఇప్పుడు మళ్లీ వచ్చానన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తానన్నారు.
అదే సమయంలో విజయ్ పార్టీపై వ్యాఖ్యానించేందుకు చంద్రబాబు నిరాకరించారు. ఎన్నికల్లోనే చూస్తారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

