తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం నుండి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండి, అకస్మాత్తుగా వర్షం మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు మేడ్చల్ జిల్లాల్లో వర్ష సూచన ఉంది.

