రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. రింకూ సింగ్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో 9 పరుగులు సాధించాల్సి ఉండగా.. రింకూ సింగ్ వరుస బౌండరీలు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. కేకేఆర్‌కు 156 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది. రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ తో కేవలం 34 బంతుల్లో 53 (5 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు బాదాడు.

