నిరుపేదలు నివాసం ఉండే ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అందరూ తమ సామాగ్రిని వదిలి ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. క్షణాల్లో వాడ మొత్తం కాలిబూడిదైంది. హర్యానాలోని రేవారీ జిల్లా కోన్సివాస్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. మురికి వాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

