ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురి కావడం తో శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర సర్జరీ నిర్వహించారు. వైద్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్ రిపోర్టులను విశ్లేషించిన డాక్టర్ల బృందం, జాప్యం చేయకుండా ఆపరేషన్ చేయాలని నిర్ణయించింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే, అసలు ఆరోగ్య సమస్య ఏమిటన్నది మాత్రం ఆయన వ్యక్తిగత బృందం గానీ, ఆసుపత్రి వర్గాలు గానీ అధికారికంగా వెల్లడించలేదు.

