కేబినెట్ సమావేశంలో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు మోదీ. నారీశక్తి వందన్ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది..

