లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం తో రేపు బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళా బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, విపక్షాలే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. విపక్షాల తీరుకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. దేశంలో మహిళా సాధికారత సాధించడం కాంగ్రెస్ పార్టీకి, విపక్షాలకు ఇష్టం లేదని..డీలిమిటేషన్ పై తప్పుడు ప్రచారం చేస్తూ బిల్లు వీగిపోయేలా చేశారని బీజేపీ ఆరోపించింది. మహిళా బిల్లు విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ప్రధానంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

