తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరయ్ ఘాట్ రోడ్డులో దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వేగంగా వెళ్లి లోయలో పడిపోయింది. పైనుంచి కిందపడడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. వ్యానులో ఉన్న పది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

