కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సురపూర్ తాలూకాలోని శాంతాపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయింది. అదుపుతప్పిన ఆ కారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. కారు, ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారు.

