కాలేజీ చివరి సంవత్సరంలో ఉండగానే వేలాది మందిని బల్క్‌గా కంపెనీలు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకునేవి. కానీ ఇప్పుడు ఆ మాస్ హైరింగ్ శకం ముగిసిందని విప్రో తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తోంది. ప్రో చీఫ్ హ్యూమన్ ఆఫిసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ… ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి. మునుపటిలా రెవెన్యూ పెరగాలంటే వేలాది మంది కొత్త ఉద్యోగులు అవసరం లేదు. ఏఐ సాయంతో తక్కువ మందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయవచ్చని కంపెనీ భావిస్తోంది.

