లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు , నియోజకవర్గాల పునర్విభజన పై జరిగిన చర్చ సందర్భంగా బాలాకోట్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకూ అన్నింటికీ మోదీ మెజిషియన్ అని రాహుల్ విమర్శించారు. మెజీషియన్ పోలికపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ .. రాహుల్ గాంధీ చేసిన మెజిషియన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును దేశ వ్యతిరేక చర్య గా రాహుల్ గాంధీ అభివర్ణించారు.

