ఇండోనేషియాలోని పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. మెల్వాయ్ లో టేకాప్ అయిన కొంచెం సేపటికే ఎయిర్ బస్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఎనిమిది మంది చనిపోయారు. మృతులలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు. ఎయిర్ బస్ హెచ్ 130 అనే హెలికాప్టర్ టెకాఫ్ అయిన తరువాత కంట్రల్ రూమ్ తో సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ సిగ్నల్ మిస్ అయినట్టుగా గుర్తించారు. టేకాఫ్ అయిన మూడు కిలో మీటర్ల దూరంలో హెలికాప్టర్ ఒక శకలాన్ని గుర్తించినట్టు సమాచారం.

