డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మొత్తం సీట్ల పెరుగుదల వల్ల ఏ రాష్ట్రం కూడా తన ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని సంపూర్ణంగా కోల్పోదని షా అన్నారు. మొత్తం 543 సీట్లలో ప్రస్తుతం ఈ సభలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 129 మంది ఎంపీలు ఉన్నారని.. ఇది సుమారుగా 23.76 శాతమని, బిల్లు తర్వాత 195 మంది ఎంపీలు ఇక్కడ ఉంటారని.. అప్పుడు 23.97 శాతంగా ఉంటుంది” అని షా అన్నారు.

