వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భూముల క్రయ, విక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం స్టాంపు డ్యూటీ ఫీజులు కట్టించడం లేదనే సమాచారం మేరకు ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ (సీనియర్ అసిస్టెంట్) వెంకట్ లాల్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా కార్యాలయంలోని పలు విభాగాలకు చెందిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

