‘నారీ శక్తి వందన్’ చట్టానికి బేషరతుగా మద్దతు పలకాలని కోరుతూ ఆయన వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు వ్యక్తిగత లేఖలు రాశారు ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా బలపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన లేఖలు పంపారు.

