చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ నివాసంపై శుక్రవారం తెల్లవారుజామున ఒక గుర్తుతెలియని యువకుడు పెట్రోల్ బాంబుతో దాడికి తెగబడ్డాడు. ఓపెన్ ఏఐ కార్యాలయాన్ని కూడా తగులబెడతానంటూ నిందితుడు హెచ్చరించాడు కృత్రిమ మేధ (AI) పట్ల సమాజంలోని ఒక వర్గంలో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోతామనే భయం, డేటా ప్రైవసీపై ఆందోళనలు మరియు మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

