ఆర్టెమిస్-2(Artemis II)లో చంద్రుడిని చుట్టివచ్చిన వ్యోమగాములు ఇవాళ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 9 రోజుల జర్నీ అత్యంత విజయవంతంగా సాగింది. పసిఫిక్ మహా సముద్రంలో ఓరియన్ క్యాప్సూల్ దిగింది. తమ బృందం ఆరోగ్యవంతంగా ఉన్నట్లు కమాండర్ రీడ్ వైజ్‌మాన్ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన ఆర్టెమిస్ నింగికి ఎగిరింది. వ్యోమగాములు సుమారు 406,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చారు.

