గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అంకితభావంతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. ‘పెద్ది’ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్ చేస్తూ చరణ్‌కు గాయమైన సంగతి తెలిసిందే. ఆ గాయానికి చిన్న సర్జరీ కూడా జరిగినప్పటికీ, మార్చి 27న, తన పుట్టినరోజు సందర్భంగా చరణ్ మళ్లీ సెట్స్‌లో కనిపించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అయింది. కంటిపైన బ్యాండేజ్ ఉన్నప్పటికీ, ఆయన ముఖంలో ఎలాంటి అసౌకర్యం కనిపించలేదు

