భారత ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన ఫిడే మహిళల క్యాండిటేట్స్ టోర్నమెంట్ నుంచి ఆమె వైదొలిగింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నందున భదత్రపై ఆందోళనగా ఉందని చెప్పిన ఆమె.. బాంబుల మోతల మధ్య చెస్‌పై శ్రద్ధ పెట్టడం సాధ్యమవ్వదని వాపోయింది. మధ్య ఆసియాలోని సిప్రస్‌లో మార్చి 28 నుంచి మొదలయ్యే ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తాను ఆడడం లేదని సోమవారం హంపి ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.

