తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశాలపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా, కమల్ హాసన్ నవ్వుతూ, “నాకెందుకు ఆ విషయం? నాకు చాలా పనులు ఉన్నాయి, వాటిపైనే దృష్టి పెట్టాలి” అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. కమల్ హాసన్ స్పందనపై అనేక మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

