టీమిండియా మాజీ హెడ్ కోచ్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ముద్ర వేసిన మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోనున్నారు. భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ప్రదర్శనకు గానూ ‘పాలి ఉమ్రీగర్’ (క్రికెటర్ ఆఫ్ ది ఇయర్) అవార్డుకు ఎంపికయ్యారు.

