జెన్-జీ నిరసనల తరువాత గురువారం (మార్చ్ 5) తొలిసారిగా నేపాల్ ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగాయి. నేడు జరుగుతున్న ఓట్ల కౌంటింగ్లో నూతన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి (ఆర్ఎస్పీ) విజయం దాదాపుగా ఖరారైనట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాజీ సింగర్ బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్ఎస్పీ 165 స్థానాలకు గాను 94 సీట్లల్లో ముందు వరుసలో ఉంది. ఇక నేపాలీ కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించగా పది స్థానాల్లో లీడ్లో ఉంది. సీపీఎన్-యూఎమ్ఎల్ పార్టీ మరో ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.

