ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు YS జగన్ మోహన్ రెడ్డిను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.రాజకీయ భేదాలకు అతీతంగా ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని వర్గాలు తెలిపాయి.

