హోలీ అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో దీన్ని దోల్యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ (“వసంతోత్సవ పండుగ”) అని అంటారు.