తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడేవారు శ్రీమంతులు కాదని పేర్కొన్నారు. సమక్క, సారక్క, కాకతీయులు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. గ్రూప్–1, 2 అధికారుల వెలిడిక్టరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో 271 మంది గ్రూప్–1, 171 మంది గ్రూప్–2 అధికారులు, 51 మంది మిలటరీ ఇంజినీరింగ్ సర్వీస్ ఉద్యోగులు ఉన్నారు.

