భారతదేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులు మరియు మారుతున్న జీవనశైలి కారణంగా విడాకుల కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గతేడాది దేశవ్యాప్తంగా సుమారు 8.27 లక్షల విడాకుల కేసులు నమోదు కావడం గమనార్హం. ఇందులో మహారాష్ట్ర 18.7 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (11.7%), తెలంగాణ (6.7%) రాష్ట్రాలు మొదటి ఆరు స్థానాల్లో నిలిచాయి. సుమారు 33.2 శాతం మంది దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోతుండగా, మిగిలిన కేసులు గృహహింస, వివాహేతర సంబంధాలు మరియు క్రూరత్వం వంటి తీవ్రమైన కారణాల వల్ల న్యాయస్థానాల మెట్లెక్కుతున్నాయి.

