విజయ్ దేవరకొండ- రష్మిక మంధన్నా పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా గురువారం ఉదయం 10.10 గంటలకు హిందూ సంప్రదాయంలో వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘నా భర్త, మిస్టర్ విజయ్ దేవరకొండను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. రష్మిక రెడ్ కలర్ శారీలో కనిపించడగా, విజయ్ సంప్రదాయ పంచకట్టులో ఉన్నారు. రాజసం ఉట్టిపడేలా విజయ్ కాళ్లు, చేతులకు కడియాలు, మెడలో బంగారు హారంతో కనిపించారు.

