అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.. ఏ క్షణాన్నైనా ఇరు దాడులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. ఈ క్రమంలో భారత్ కీలక ప్రకటన చేసింది. టెహ్రాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ను విడిచి వెళ్లాలని భారత్ పౌరులను కోరింది. రాబోయే రోజుల్లో అమెరికా దాడుల జరగొచ్చని.. దీని కారణంగా ఇరాన్‌లోని భారతీయులు.. దేశాన్ని విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయ అధికారులు సూచించారు. “వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచి వెళ్లాలని” పౌరులను కోరింది.

