అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, AIADMK వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ సమన్వయకర్త O. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి M.K. స్టాలిన్‌ను స్వయంగా కలుసుకుని మాట్లాడారు. అసెంబ్లీలో స్టాలిన్ పాలన బాగుంది అంటూ పన్నీ్ర్ సెల్వం ప్రశంసలు కురింపించారు స్టాలిన్-ఓపీఎస్ సమావేశం తర్వాత, ఓపీఎస్ డీఎంకే పార్టీలో చేరబోతున్నారా అనే ప్రశ్న తలెత్తింది.

