కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లక్నోలోని సుల్తాన్పూర్ కోర్టులో పరువు నష్టం కేసు విచారణలో భాగంగా హాజరయ్యారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది. బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా, నేటి విచారణలో భాగంగా రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై తన హాజరును నమోదు చేశారు.

