ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యవహారం పై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. మంగళవారం, బుధవారం కూడా వైసీపీ తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని అందజేయగా, ఛైర్మన్ దానిని డిస్మిస్ చేశారు.మండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై అసెంబ్లీలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందుకే మండలిలో చర్చకు డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

