శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. ‘గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం చాలా కీలకమైంది. గతంలో 3శాతం పాఠశాలల్లో మాత్రమే వన్ క్లాస్ – వన్ టీచర్ ఉంటే, ఇప్పుడు 33శాతానికి పెంచాం. దీనిద్వారా పిల్లలకు మెరుగైన విద్య అంది, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి’అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

