మరి కొద్ది నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు చాలా వరకు ఆటోమేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. డాక్యుమెంట్ ఇన్స్పెక్షన్, ఫైనాన్షియల్ అనాలసిస్, కాంప్లియన్స్ చెక్, మార్కెటింగ్ ఆప్టిమైజేషన్, షెడ్యూలింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ప్రభావితమవుతాయిని తెలిపారు. మనుషులు రోజువారీగా చేసే అన్ని పనుల్ని సమర్థంగా చేయగల ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసే పనిలో మైక్రోసాఫ్ట్ ఉందని, ఇది అత్యంత శక్తిమంతమైన ఏఐ టూల్ అని అన్నారు.

