మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 103 సెంటర్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. మూడు గంటలలోపు మున్సిపాలిటీల ఫలితాలు, రాత్రిలోపు కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగ్గా ఎవరికీ వారే గెలుపు అంచనాలతో క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.

