వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో కీలక రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ-కామర్స్, క్విక్ కామర్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఫ్లిప్‌కార్ట్, ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, మే-జూన్ నెలల్లో బెంగళూరులో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించనుంది. ఈ వార్తలతో స్విగ్గీ, జొమాటోల షేర్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి.

