ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరుడిని కలిశారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగనట్టు చెప్తున్నారు.

