ఆంధ్రప్రదేశ్ (AP) లో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి పంజా విసురుతోంది. చిత్తూరు జిల్లా సదుం మండలంలో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గత వారం రోజులుగా మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందుతున్నాయి.స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో వీటికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

