దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పీరాగఢి ఫ్లైఓవర్ వద్ద పార్క్ చేసి ఉన్న ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకే కారులో ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇది హత్యా? లేక కారులో ఏవైనా విషవాయువులు లీక్ అయి జరిగిన ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

