దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల ఏరివేత అంశంపై ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమవేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా తుడిచివేస్తామన్నారు. వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. , భద్రతా దళాల ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు మావోయిస్టుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయన్నారు.

