ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో ఇవాళ అమరావతిలో సమీక్ష నిర్వహించారు ‘హాస్టళ్లలో విద్యార్థులకు ఏమైనా జరిగితే ముందుగా సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి, తర్వాతే మిగతా విషయాలు చర్చిస్తాను’ అని ఆయన హెచ్చరించారు. రేపటిలోగా (ఫిబ్రవరి 9) సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

