ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి రసవత్తర పోరులో నేపాల్‌పై ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేపట్టింది.నేపాల్ బౌలర్లు మధ్యలో పుంజుకుని కీలక వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. నేపాల్ బ్యాటర్లు అద్భుతమైన షాట్లతో అలరించారు. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి నేపాల్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

