కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సతీమణి ఎలిజబెత్ గొగోయ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌఖీర్ షేక్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఏజెంట్ 2010-13 మధ్యకాలంలో 13 సార్లు భారత్‌కు వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని పేర్కొన్నారు. ఆదివారం గువాహటిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

