ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశీయంగా అభివృద్ధి చెందిన సర్వం AI ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సర్వం AI సాధించిన విజయాన్ని కొనియాడారు. గతంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన డిడి దాస్, సర్వం AI సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ఒక ఏడాది క్రితం ఇండిక్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి నాకున్న అంచనా తప్పు అని సర్వం నిరూపించింది. దీని టెక్స్ట్-టు-స్పీచ్, OCR సామర్థ్యాలు అద్భుతం’’ అని ఆయన ప్రశంసించారు.

