బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తన లేటెస్ట్ సినిమా ‘గూస్కోర్ పండిట్’ టైటిల్లోని ‘పండిట్’ పదంపై నెలకొన్న వివాదంపై స్పందించారు. ఈ టైటిల్ వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్లందరి భావాలను గౌరవిస్తానని తెలిపారు. సినిమాలో అది కేవలం కల్పిత పాత్రే అని, ఎవరిని ఉద్దేశించింది కాదని అన్నారు. ఈ మేరకు మనోజ్ బాజ్‌పాయి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ప్రమోషనల్ వీడియోలను మేకర్స్ తొలగించారు.

