సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్… మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు, కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి? ఎన్నిసార్లు రైతుబంధు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారని,అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు.

