చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను నిరసిస్తూ ఆ వార్డు ఓటర్లు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారని ఆరోపిస్తూ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు తెలుపకుండా ఎలా నామినేషన్లు ఉప సంహరించుకుంటారని వారు ప్రశ్నించారు. ఓటు హక్కు వినియోగించుకోకుంటే తాము చనిపోయినట్టేనని, తమకు డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

