బుల్లితెరపై నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ స్టేజిపై అతను అత్యుత్సాహంతో బూతు పదాలు ఉన్న పాట పాడటం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. అతిథిగా హాజరైన నటుడు జేడీ చక్రవర్తి తాను చప్పట్లు కొడుతూ ఆస్వాదించినట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రహాస్ పాట పాడుతుండగా తాను, మరో దర్శకుడు జయంత్ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయామని చెప్పారు. అప్పటికప్పుడు స్టేజ్ వదిలి వెళ్లిపోదామనుకున్నప్పటికీ, అలా చేస్తే సినిమా మీద నెగెటివ్ ప్రభావం పడుతుందని భావించి ఆగిపోయానన్నారు.

