తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్డీయే కూటమిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీని ఉరకలెత్తించిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై, ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఇద్దరూ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే తో పొత్తు కుదిరినందున సీట్ల సర్దుబాటు , అంతర్గత సమీకరణాల దృష్ట్యా వీరిద్దరూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

